మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

– ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి

నవతెలంగాణ – పెద్దవంగర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ‘నవతెలంగాణ’ తో మాట్లాడుతూ.. బిడ్డగా పుట్టి, కూతురిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా అనేక పాత్రలు పోషిస్తూ.. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. అనేక ఉన్నత పదవులకు గౌరవాన్ని తీసుకువస్తున్నారని చెప్పారు. నేల నుండి నింగి వరకు మహిళలు సత్తా చాటుతూనే ఉన్నారన్నారు. మా భర్తలు అందించిన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఇరువురూ రాణించామని పేర్కొన్నారు. ప్రతి మహిళ అన్నిట్లో రంగాల్లో రాణించాలని, ప్రతి ఒక్కరూ మహిళా దినోత్సవాన్ని సంతోషంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.