
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాంపల్లి ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు యమునా, ప్రణిత, భాగ్య ,కళ్యాణి ల కు పూల బొకే అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, నరసింహారావు ,కోటేశ్వరరావు ,శ్రీనివాస్ ,ప్రభాకర్ ,నర్సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.