ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం..

World Adivasi Dayనవతెలంగాణ – బజార్ హత్నూర్
ప్రపంచ ఆదివాసి దినోత్సవం శుక్రవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని చింతల సంగ్వి గ్రామంలో  ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని  గ్రామంలోని కొమురం భీమ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి డోలు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించి, దేవి దేవతలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటేల్ భీమ్రావు, జగదీష్, జయవంత్ రావు, హనుమంతు, తుకారం ,ఆదివాసి యూత్ అధ్యక్షుడు సుభాష్ ,మహిళలు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.