ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం 

Happy World Conservation Dayనవతెలంగాణ – తాడ్వాయి 
మండల కేంద్రంలో ఆదివారం తాడ్వాయి అటవీశాఖ ఆధ్వర్యంలో  ఘనంగా ప్రపంచ ప్రకృతి పరీరక్ష దినోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా ఎఫ్ఆర్ఓ షౌకత్ కత్ అలీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ షౌకత్ అలీ, హాస్టల్ వార్డెన్ మోకాళ్ళ లక్ష్మి లు  మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండే మొక్కలు నాటడం, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం అలవర్చుకోవాలన్నారు. భూమిపై ప్రతి జీవి బ్రతకాలంటే ప్రకృతిలో ఉన్న సహజ వనరులు గాలి, నేల, నీరు, మొక్కలు, ఖనిజాల, సహజవాయువులు సమస్థితిలో ఉండాలని అన్నారు. జనాభా పెరుగుదల, అవగాహన లేని నిర్లక్ష్య వలన సహజ వనరులు తగ్గిపోవడంతో ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినడం వల్ల కష్టాలు మొదలయ్యాయని అందుకే ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ మోకాళ్ళ లక్ష్మి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లింగం, స్వరూప రాణి, బీట్ ఆఫీసర్లు పీరీల కార్తీక్, శరత్,రవి, రాజేష్, రాజు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.