మండల కేంద్రంలో ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పస్రా గోవిందరావుపేట చలువాయి మచ్చాపూర్ గ్రామాలలో జెండావిష్కరణలు ఆయా గ్రామాల మత్స్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మత్స్యకారులందరూ నవంబర్ 21 పండుగ దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుంది మత్స్యకారుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టాలని మత్స్య అభివృద్ధిని పెంపొందించాలని మైదాన ప్రాంతంలోని చెరువులు కుంటలను అభివృద్ధి పరచాలని ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేయాలని తెలంగాణ మత్స్య శాఖకు 3000 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయించాలని జీవో ఎంఎస్ నెంబర్ 74 జీవో ఎంఎస్ నెంబర్ 98 జీవో ఎంఎస్ నెంబర్ 4 మొత్తం ఆరు జీవలను అమలుపరుస్తూ చెరువు కుంటలు మత్స్య సంపదపై పూర్తి హక్కులు ముదిరాజులకు బెస్త లకు గంగపుత్రులకు మాత్రమే చట్టపరమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారునికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ ఏ కుమార్చాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ లో మొదటి అంశం బిసి రిజర్వేషన్ మీద మాట్లాడారు ముదిరాజుల స్థితిగతులు తెలిసినా రేవంత్ రెడ్డి గారికి జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు కేటాయించగలరని కోరుతున్నాము చాప పిల్లల పంపిణీలో దళారి వ్యవస్థకు తావు లేకుండా వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే మాసంలోనే సంఘాల అకౌంట్లోనే నగదు బదిలీ చేయాలని అప్పుడే మత్స్యకారులు అభివృద్ధి చెందే విధంగా ముందస్తుగా చేప పిల్లలు తెచ్చుకొని చెరువుల కుంటల్లో పోసుకుంటారని విన్నవించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో వద్దులే మల్లయ్య కక్కు సాంబయ్య పులి గుజ్జు సురేషు కకుసుమన్ మొటం సాంబయ్య బండిసదయ బండి మల్లేశం రేగూల లక్ష్మయ్య కౌంటం కిరణ్ జీ రమేష్ గోనేల రాజ్ కూమార్ యాకయ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.