ఘణంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

Happy World Photography Dayనవతెలంగాణ – మల్హర్ రావు
185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగులాంబిక ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో కెమెరా సృష్టికర్త లూయిస్ జాకస్ మండే డాగూరే కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. అనంతరం పలువురు మాట్లాడారు. ప్రొటోగ్రఫీ గొప్పతనాన్ని తెలుపుతూ ఫోటో ఒక గొప్ప జ్ఞాపకం, తరాలు మారిన ఫోటో శాశ్వతము, మనిషి ఆశాశ్వతము అని, అందుకే ఫోటో కెమెరా సృష్టికర్త అయిన డాగూరే పుట్టిన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రాఫీ దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. ఆయన కెమెరా టెక్నాలజీ ద్వారా కొన్ని కోట్ల మంది తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారని స్మరించుకోవడం జరిగిందన్నారు. ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న మిత్రులందరూ నిత్యం నూతనం అనే సిద్ధాతంతో ఈ వృత్తి ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు నడవాలని,  ఫోటోగ్రాఫర్లు అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు జక్కుల రమేష్ ,ప్రధాన కార్యదర్శి సలాది నవీన్,కోశాధికారి ఆకుల సతీష్, ఫోటోగ్రాఫర్ లు వేల్పుల సతీష్,మదునయ్య, రాజ శేఖర్  పాల్గొన్నారు.