నవతెలంగాణ – అశ్వారావుపేట
హర్ ఘర్ హర్ జల్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజారోగ్యం లో భాగంగా ఇంటింటి కీ శుద్ధి జలం సరఫరా చేయాలని గ్రామ పంచాయితీ సిబ్బందికి ఆదేశించారు. కార్యదర్శి బంగారు సందీప్ అద్యక్షతన శనివారం పంచాయితీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు.ఈ పంచాయితీ ప్రత్యేక అధికారిగా తహశీల్దార్ వి.క్రిష్ణప్రసాద్ హాజరై మాట్లాడారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపద్యంలో తరుణ వ్యాదులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వైద్యం ఆరోగ్యం,పరిసరాల పరిశుభ్రత పై ఆశాలు,ఏఎన్ఎం లు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలు,ఆరోగ్య ఉప కేంద్రాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అంగన్వాడి సిబ్బంది వారి పరిధిలోని ప్రతి ఇంటినీ సర్వే నిర్వహించి జ్వరాలు,ఇతర వ్యాదుల వివరాలను సేకరించి వైద్య సహాయం అందించాలని తెలిపారు.పంచాయతీ సిబ్బంది శుద్ధమైన త్రాగు నీటిని ప్రజలకు సరఫరా చేయాలని అన్నారు. ఈ గ్రామ సభలో పంచాయితీ గుమస్తా ముశికి రమణ తో పాటు ఏఎన్ఎం లు, అంగన్వాడి,ఆశ,పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.