నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి యాజమాన్యం వైద్య శిబిరాల పేరుతో కాంట్రాక్టు కార్మికులను వేదించడం మానుకోవాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఎస్సీసీడబ్ల్యూయూ-ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు డి బ్రహ్మానందం అన్నారు. నస్పూర్ సివిల్ కార్యాలయంలో(ఎస్‌స్సీసీడబ్ల్యూయూ-ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్యం కల్పించలేని సింగరేణి యాజమాన్యం మెడికల్ క్యాంపులలో బీపీ, షుగరు, ఈసీజీ టెస్టుల పేరుతో కార్మికులను ఆందోళనకు గురి చేస్తున్నరని మండిపడ్డారు. సింగరేణిలోని వివిధ విభాగంలో పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రధానంగా డస్ట్ వల్ల వచ్చే జబ్బులకు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కానీ మైనింగ్ ఏరియాలో అదేవిధంగా అధికారుల, పర్మినెంట్ కార్మికుల నివాస ప్రాంతలలో, ఆఫీస్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు ప్రధానంగా దుమ్ము, దూళి వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయన్నారు. కానీ ఈ కార్మికులకు సింగరేణిలో ఎక్కడ కూడా ఉచిత వైద్యం ఇన్ పేషెంట్‌గా కల్పించడం లేదని, అలాంటి పరిస్థితుల్లో నేడు సింగరేణి యాజమాన్యం ఆరోగ్యవంతమైన కార్మికులు కావాలని ఉద్దేశంతో డిస్పెన్సరీ, మైనింగ్ ఏరియాలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీపీ, షుగర్, ఈసీజీలో, చిన్న చిన్న తేడాలొచ్చిన కాంట్రాక్టు కార్మికులను డ్యూటీలోకి తీసుకోకుండా డాక్టర్లు నాట్ ఫర్ అలో డ్యూటీ అని రాస్తున్నారన్నారు. దీనివల్ల ప్రధానంగా ఈసీజీ కాకుండా టుడీ ఎకో చేయించుకోవాలంటే బెల్లంపల్లి రీజియన్‌లో సింగరేణి నిర్వహిస్తున్న ఏ హాస్పిటల్లో టుడీ ఎకో ఆపరేటర్ డాక్టర్లు గాని లేరన్నారు. నిర్దక్షణంగా కాంట్రాక్ట్ కార్మికులు మంచిర్యాల పరిసర ప్రాంతంలోని ప్రయివేట్ ఆస్పత్రకికి వెళ్లి రూ. వేల ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆలోపు ఒక్కో కాంట్రాక్ట్ కార్మికుడు సింగరేణి ఏరియా హాస్పిటల్ చుట్టూ, మంచిర్యాల ప్రయివేట్ హాస్పిటల్‌లో చుట్టూ తిరిగి మాస్టర్లు కోల్పోవాల్సి వస్తుందన్నారు. దీనివల్ల కార్మికులు ఆందోళన గురి అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బి రాజేందర్, ఎం శంకర్, తిరుపతి, గోపాల్, అప్పారావు, రాజు, జంపయ్య, సంపత్, నాగరాజు, కొమురయ్య, నరసమ్మ, కమలమ్మ, పుష్ప, శారద, నాగమణి, తిరుమల, గౌరీ, లక్ష్మి, రాజమ్మ, లలిత పాల్గొన్నారు.