– ఉపాధ్యాయునికి దేహశుద్ధి, అరెస్ట్
నవతెలంగాణ – భువనగిరి
విద్యార్థినిని వేధిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి కుటుంబీకులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణం లోని బ్రిలియంట్ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు సంజరుకుమార్ 10వ తరగతి విద్యార్థినికి ఫోన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపుతూ వేధించాడు. కొన్ని నెలలుగా వేధింపులు ఎక్కువ కావటంతో విద్యార్థిని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు బుధవారం పాఠశాలకు వచ్చి అతనికి దేహశుద్ధి చేశా రు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజరుకుమార్‌ను అరెస్టు చేశారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై చర్య లు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
విద్యార్థినులను బెదిరిస్తూ.. లైంగిక వేధింపులకుగురి చేసిన ఉపాధ్యాయున్ని కఠినంగా శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడంతోపాటు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలను వివరించాలని కోరారు. గతంలో జిల్లా కలెక్టర్ ఇలాంటి ఘటనపై విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.