హార్దిక్‌ అవుట్‌, ప్రసిద్‌ ఇన్‌

Hardik out, Prasid inముంబయి : భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. చీలమండ గాయానికి గురైన హార్దిక్‌ పాండ్య ఆశించిన సమయానికి కోలుకోలేదు. దీంతో హార్దిక్‌ పాండ్య స్థానంలో పేసర్‌ ప్రసిద్‌ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 17 వన్డేల్లో 29 వికెట్లు పడగొట్టిన ప్రసిద్‌ కృష్ణ.. ప్రపంచకప్‌ ముంగిట ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.