– జీఏడీ కార్యదర్శిగా కె నిర్మల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. సోమవారం మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయూష్ శాఖ డైరెక్టర్గా ఉన్న హరిచందన దాసరిని పురపాలక శాఖ డైరెక్టర్గా, ప్రజావాణి నోడల్ అధికారిగా బదిలీ చేశారు. పీఈ శాఖ కార్యదర్శిగా ఉన్న కె నిర్మలను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శిగా బదిలీ అయ్యారు.