ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఓటే: ఈఓ హరిక్రిష్ణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
సమర్ధవంతమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు సామాన్యుల ఆయుధం ఓటే నని,అటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఆదర్శవంతమైన పాలకులను ఎన్నుకోవాలని మేజర్ పంచాయతీ ఈఓ గజవెల్లి హరికృష్ణ తెలిపారు. బుధవారం పట్టణంలోని కోనేరు చెరువులో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి సిబ్బందికి ఓటు హక్కు వినియోగం,కలుగు ప్రయోజనాలను వివరించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.అనంతరం సిబ్బంది చే ఓటు ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.