వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాన్గల్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని గుడి కందుల గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గడ్డి మందు పిచికారి చేయడంతో పాటు గ్రామంలోని డ్రైనేజీల పై బ్లీచింగ్ పౌడర్ ను చల్లా రు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మండ ల ప్రజలంద రూ సీజనల్ వ్యాధుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని అన్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాల న్నారు. గ్రామ పంచాయతీలలో నిధుల కొరత వేధిస్తోందని పంచాయతీ కార్యదర్శులు మానవత దృక్పథంతో పనిచేయాలని కోరారు. గ్రామ పంచా యతీలకు రావలసిన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అధికారు లు, వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫ రెన్స్ నిర్వ హిస్తూ తగిన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడకుండా అధికారు లు, వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజ లందరూ తమ ఇంటి పరిసరాల లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దానిపై దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింత బైరా రెడ్డి, ఉప్పరి సతీష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.