దాడులకు హరీశ్‌ రావు భయపడడు

– బీఆర్‌ఎస్‌ నాయకులు నగేష్‌ ముదిరాజ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దాడులకు మాజీ మంత్రి హరీశ్‌ రావు భయపడబోరని బీఆర్‌ఎస్‌ నాయకులు నగేష్‌ ముదిరాజ్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌ రావు, ఆయన అనుచురులపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కు సంబంధించిన వ్యక్తులు గుండాల్లా ప్రవర్తించి రాళ్ల దాడి చేశారని ఖండించారు. పోలీసుల సమక్షంలో పక్కా ప్రణాళికతో జరిగిన దాడి తీరు చూస్తుంటే ఈ దాడికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిం చారు. ఖమ్మం ప్రజలు కాంగ్రెస్‌ నాయకులను అసహ్యిం చుకుంటున్నారని తెలిపారు.