హరీశ్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలి

Harish Rao should win with a huge majorityనవతెలంగాణ-చిన్నకోడూరు
ప్రజల కష్టసుఖాలు బాగా తెలిసిన మంత్రి హరీశ్‌రావుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి కోరారు. మండలంలోని ఎల్లాయపల్లి గ్రామంలో సిద్దిపేట శాసన సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావు పక్షాన బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సమస్యలు ఉన్నాయని క్షణికావేశంలో ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయోద్దనీ, మంత్రి హరీశ్‌రావు దష్టికి మీమీ గ్రామంలోని సమస్యలు తీసుకెళ్ళి పరిష్కారం కోసం కషి చేస్తామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగేవని కానీ నేడు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్‌పర్సన్‌ కొండంత వనిత రవిందర్‌ రెడ్డి, ఎంపీపీి ఉపాధ్యక్షులు పాపయ్య, పీఎసీఎస్‌ చైర్మన్‌లు సదానందం, కనకరాజు, గ్రామసర్పంచ్‌ మహేందర్‌ పాల్గొన్నారు.