– కాళేశ్వరం కొట్టుకుపోయింది.. ప్రాజెక్టు లోకి నీళ్లెలా వొచ్చాయో
– బీఆర్ఎస్ వి కిసాన్ పాలిటిక్స్
– కాంగ్రెస్ వి డై వర్షన్ పాలిటిక్స్
– మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు
నవతెలంగాణ – తొగుట
రైతుల కోసం కెసిఆర్ పనిచేస్తుంటే, రేవంత్ సర్కా ర్ మాత్రం డైవర్శన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పేర్కొన్నారు. శుక్రవా రం దుబ్బాక, నర్సాపూర్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు పి వెంక ట్రామారెడ్డి, దేశపతి శ్రీనివాస్, డా. వంటేరు యాద వరెడ్డి, మాజీ ఎఫ్డీసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి మల్లన్న సాగర్ ను సందర్శించి, గోదా వరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని, 93 వేల కోట్లతో పనులు జరిగితే లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. కాళేశ్వరం లో అవినీతి జరిగితే ఎల్లంపల్లి నుండి లక్ష్మి బ్యారేజ్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నేడు నీళ్లు ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. నేడు అన్ని ప్రాజెక్ట్ లలో నీళ్లు నిండు కుండలా ఉన్నాయంటే అది ప్రాజెక్ట్ ఫలితమేనన్నారు. ప్రతిపక్షం లో ఉన్న ప్పుడు ప్రాజెక్టు ల నిర్మాణంను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు, అధికారంలో ఉన్నప్పుడు కూడా బుద్ది మారడం లేదన్నారు. 21టీఎంసి ల నీటితో కళకళ లాడుతున్న మల్లన్న సాగర్ లో పూజలు నిర్వ హిస్తామని వొస్తే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. మీరు వొచ్చి పూజలు చేయండి చేసిన పాపాలు కొన్నయినా పోతాయని హితువు పలికారు.
మల్ల న్న సాగర్ నీటితో పండే ప్రతి గింజలో కెసిఆర్ పేరుంటుంది అని, రైతు గుండెల్లో కెసిఆర్ ఉంటా డని తెలిపారు. కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్న కాంగ్రెస్ నాయకులు బుద్ది తెచ్చుకోవాల న్నారు. కాళేశ్వరం కొట్టుకు పోతే అన్నపూర్ణ లో 3, రంగనాయక సాగర్ లో 3, మల్లన్న సాగర్ లో 21, కొండపోచమ్మ సాగర్ లో 10 టిఎంసి ల నీళ్లు ఎలా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. గతంలో ఆగస్టు నెలలో చేప పిల్లలు వేశామని, నేడు సెప్టెంబర్ 20, నేటి ప్రభుత్వం దాటినా చేప పిల్లలు వేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి చేపలు, రొయ్యలు వేసి మత్స్య కారులను ఆదుకోవాల న్నారు. చెరువు, కుంటలను ప్రాజెక్టు లతో అనుసం ధానం చేసుకోవడంతో మత్స్య కారులకు మేలు జరిగిందన్నారు. మెదక్, యాదాద్రి, సిద్దిపేట జిల్లలో పంటలు పండటం మీకు ఇష్టం లేదా అని ప్రశ్నిం చారు. మల్లన్న సాగర్ పూర్తి అయిందని, అసం పూర్తిగా ఉన్న కాలువలు పూర్తి చేయాలన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు, మూసీ కి నీళ్లు తీసు కెళ్తా అన్నారు.. దానికి కెసిఆర్ నిర్మించిన మల్లన్న సాగర్ తోనే సాధ్యం అవుతుంది కదా అని చుర కలు అంటిచారు.
పిల్ల కాలువలు అయినా పూర్తి చేయండి.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..
కెసిఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకొని సాగునీళ్లు తెచ్చుకుంటే కాంగ్రెస్ నాయకులు కనీసం పిల్ల కాలువలు అయినా పూర్తి చేయడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మా హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్ లోకి పూజలు చేసుకోవడానికి వొస్తే అడ్డుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు లు, నీళ్లు అంటేనే కెసిఆర్ అని ప్రజల గుండెల్లో నిలిచిపోయడన్నారు. తెలంగాణ సాధిం చుకున్నదే సాగునీళ్ళ కోసమని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాజెక్టు లు కట్టు కున్న ఘనత కెసిఆర్ హయాంలో తెలంగాణ లో జరిగిందన్నారు. . రైతుల మీద చిత్త శుద్ధి ఉంటే మిగిలిపోయిన కాలువలు పూర్తి చేయాలన్నారు. రైతు హితమే కెసిఆర్ ద్యేయం కాంగ్రెస్ మాటలు అబద్దాలు అని తేలి పోయాయి ఎమ్మెల్సీ పి వెంకట్రామారెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని అబద్దపు ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు మల్లన్న సాగర్ లో నిండిన నీళ్లే సమాధానం చెప్తున్నాయాన్నారు.
కాంగ్రెస్ మాయ మాటలని తేలిపోయాయి: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు మల్లన్న సాగర్ లో వొస్తున్న నీటితో తెలిపోయాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు మూలంగా నర్సాపూర్ నియోజకవర్గం లోకి నీళ్లు వొస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కొట్టుకు పోయింది అన్నారు. భారీ వరదలు జ్ బురుద రాజకీయాలను తట్టుకొని ప్రాజెక్టు నిల బడింది అని పేర్కొన్నారు. ఈసందర్బంగా కెసిఆర్, హరీష్ రావు లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
పారే గోదావరి జలాల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ కొలువై ఉన్నాడని, చెరిపి వేయడం ఎవరికీ సాధ్యం కాదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొ న్నారు. ప్రాజెక్టు నీళ్ల తో పండే పంటలో, కూడవెల్లి, హల్ది వాగులో పారె నీళ్లలో కెసిఆర్ ఉన్నాడని అన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజల నుండి కెసిఆర్ ను వేరు చేయలే రన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్య క్షులు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కె హరి కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు దోమల కొమురయ్య, చిలువేరి మల్లా రెడ్డి, సుతారి రమేష్, చెరుకు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.