నవతెలంగాణ కంటేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను నిజామాబాద్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఘణనీయoగా నిర్వహించడం జరుగుతుంది. జూన్ 2 నుండి 22 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జూన్ 19న హరిత హారం సోమవారం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో హరిత హారం కార్యాక్రమం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాలు, డివిజన్ కార్యాలయలలో హరిత హారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు హరితహారం కార్యక్రమం అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. మధుసుధన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి మన పిల్లలకు కానుకగా ఇవ్వాలని అన్నారు. ఇందులో భాగంగా హారితహారం కార్య క్రమం నిర్వహించడం జరిగింది అని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్) గిరిరాజు, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ శ్రీశైలం, మహిళా పోలీస్ స్టేషన్ సి.ఐ ప్రతాప్ కుమార్, టౌన్ సి.ఐ శ్రీ వెంకట్నా రాయణ, ట్రాఫిక్ సి.ఐ చందర్ రాథోడ్, ఐ.టి కోర్ సి.ఐ ముఖీద్ పాషా, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ శ్రీ అనిల్, శ్రీ శైలేందర్, వెంకటప్పలనాయుడు, శేఖర్, ఎస్. ఐలు, ఆర్.ఎస్.ఐలు మరియు స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.