హరిత సంకల్పం హరి!

– వృధాగా పడవేసిన పాలిథిన్ మట్టి సంచులు
నవతెలంగాణ- మల్హర్ రావు
రాష్ట్రంలో అడవుల శాతం పెంచడంతోపాటు, పర్యావరణ పరిరక్షణ, గ్రామాల్లో పచ్చదనం కోసం ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమం లక్షలు వెచ్చించి హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపడుతుంది.ఈ నేపధ్యంలో మండలంలోని నాచారం గ్రామంలో మొక్కలు పెంచడానికి వేలాది పాళిథిన్ కవర్లలో మట్టి నింపి  వృధాగా పడవేసిన పరిస్థితి గ్రామంలో శ్మశాన వాటిక వద్ద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కనిపించింది. దీంతో హరిత సంకల్పం ఆదిలోనే హరి అన్నట్టుగా తయారైంది.సంబంధించిన అధికారులు నర్సరీలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా లక్షల ప్రభుత్వ దుర్వినియోగం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి వృధాగా పాలిథిన్ మట్టి సంచులు పడవేసిన వారిపై చర్యలు తీసుకొని ప్రజసొమ్మును కాపాడాలని పలువురు కోరుతున్నారు.