తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో హరితహారం

– ఏన్నారై సహాయంతో కార్యక్రమం 
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రదనోపాధ్యాయుడు మాట్లాడారు పాఠశాలలో విద్యార్థులకు,ఉపాధ్యాయులకు,చుట్టుపక్కల ప్రజలకు అరేబియన్ అనే అక్షిజన్ అందించడానికి హన్మకొండ పట్టణానికి చెందిన ఏఎన్నారై నందకిషిర్ రూ.35 వేల ఆర్థిక సహాయంతో 125 మొక్కలు నాటడం జరిగిందన్నారు.ఇందుకు పాఠశాల తరుపున ఏన్నారై కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.