చౌదర్ పల్లిలో హరితోత్సవం

నవతెలంగాణ-దుబ్బాక రూరల్
అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో సోమవారం సర్పంచ్ ఆధ్వర్యంలో హరితోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గం,గ్రామస్తులతో కలిసి సర్పంచ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ మానవ మనుగడకు ఆక్సిజన్ అవసరమని, మొక్కల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ సెక్రెటరీ కిషన్, అంగన్వాడీ టీచర్ విజయ ,ఆశా వర్కర్ రమ్య, వివోఏ హైమావతి, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, గ్రామస్తులు,యువత ఉన్నారు.