– ఇండియా మహిళలు 172/3
– శ్రీలంకతో ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్
దుబాయ్: ఐసిసి మహిళల టి20 ప్రపంచ కప్‌లో హర్మన్‌ప్రీత్ సేన తొలిసారి జూలు విదిలించింది. భారీ రన్‌రేట్ లక్ష్యంగా శ్రీలంకతో పోరుకు సిద్ధమైన భారత బ్యాటర్లు పంజా విసిరారు. ఆసియా కప్ ఫైనల్లో షాకిచ్చిన శ్రీలంకపై నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 172పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేశారు. ఓపెనర్లు స్మృతి మంధాన(50), షఫాలీ వర్మ(43) తొలిసారి అదిరే ఆరంభమివ్వగా.. చివర్లో హర్మన్‌ప్రీత్ కౌర్(52 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆఖరి ఓవర్లో వరుసగా రెండు బంతుల్ని బౌండరీకి పంపి అర్ధ శతకంతో జట్టు స్కోర్ 170 దాటించింది. ఈ టి20 ప్రపంచ కప్‌లో ఇదే అత్యధిక స్కోర్. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడగా.. ఆ తర్వాత పాకిస్థాన్‌పై గెలిచాము చాలు అన్న ఫీలింగ్. ఈ దశలో మూడో మ్యాచ్‌లో లంకను దాటితేగానీ సెమీస్ చేరడం కష్టమనే దశలో భారత అమ్మాయిలు బ్యాట్ ఝుళిపించారు. లంక స్పిన్నర్లు దీటుగా ఎదుర్కొంటూ లెగ్ సైడ్‌లో బౌండరీలు బాదేసింది. దాంతో.. టీమిండియా స్కోర్ వడివడిగా.. 150 దాటేసింది. ఆఖరి మూడు ఓవర్లలో మరింత రెచ్చిపోయిన కౌర్ బౌండరీలతో విరుచుకుపడింది. రీచా ఘోష్(6) అండగా ధనాధన్ ఆడింది. చివరి ఓవర్లో రెండు ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించిన ఆమె లంకకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు, కాంచనకు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
ఇండియా మహిళల ఇన్నింగ్స్: షెఫాలీ వర్మ (సి)గుణరత్నే (బి)ఆటపట్టు 43, మంధాన (రనౌట్) కాంచన/ఆటపట్టు 50, హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 52, రోడ్రిగ్స్ (సి)ప్రభోధన (బి)కాంచన 16, రీచా (నాటౌట్) 6, అదనం 5. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 172పరుగులు.
వికెట్ల పతనం: 1/98, 2/98, 3/128
బౌలింగ్: ప్రియదర్శిని 2-0-11-0, సుగంధిక 3-0-29-0, ప్రభోధని 3-0-32-0, కవిషా 2-0-11-0, రణవీరా 3-0-26-0, ఆటపట్టు 4-0-34-1, కాంచన 3-0-29-1.న