నష్టం కలిగించే జీవో నెంబర్ 10 ని వెంటనే రద్దు చేయాలి

– రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు రెండు లక్షలు హెల్పర్ కు ఒక లక్ష పెంచాలి

– విఆర్ఎస్ కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలి
– రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతంలో సగం జీతాన్ని పెన్షన్ గా అందించాలి
– సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట ధర్నా ఆందోళన
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాడు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంగన్వాడి రిటైర్మెంట్ అయ్యే టీచర్లు హెల్పర్లు మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట శనివారం నాడు డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలకు సీఐటీయూ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సురేష్ గొండ మద్దతు పలుకుతూ ఆందోళన చేశారు. రిటర్మెంట్ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టు సీఐటీయూ కార్మిక సంఘం నాయకులు టీచర్లు మద్దతు పలుకుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు లో పని చేసే అంగన్వాడి రిటైర్మెంట్ టీచర్లకు హెల్పర్లకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఆ వినతిపత్రంలో న్యాయమైన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. మొదట నష్టం కలిగించే జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలి రెండవది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్ కు రెండు లక్షల హెల్పర్ కు ఒక లక్ష పెంచాలి మూడోది వి ఆర్ ఎస్ కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలి నాలుగోది రిటైర్మెంట్ అయ్యే టీచర్లకు హెల్పర్లకు జీతంలో సగం జీతాన్ని పెన్షన్ గా అందించాలి. ఈ విధమైన డిమాండ్లతో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమంలో రిటైర్మెంట్ టీచర్లు హెల్పర్లు పాల్గొనగా వీరికి మద్దతుగా సీఐటీయూ గౌరవ అధ్యక్షులు సురేష్ గొండ అలాగే ప్రాజెక్టు పరిధిలోని యూనియన్ నాయకులు అంగన్వాడి టీచర్లు అనసూయ సచిత సుమలత లక్ష్మీ శాంతాబాయి సుశీల భారతమ్మ శేషాబాయి రుక్మిణి భాయి నసీమాబీ పాల్గొన్నారు.