ఇవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలనీ, ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్ టీజింగ్ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్, సుమతి అన్నారు. భీంగల్ పట్టణంలోని గవర్నమెంట్ కాలేజ్ క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్, వేధింపులకు గురైతే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్ 8712659795కు, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. అనంతరం కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి గారు వారి సందేశములో కళాశాల విద్యార్థినిలకు ఎలాంటి ఇబ్బంది ఉన్న ఆ ఇబ్బందులను వెంటనే తనకు తెలియజేసినట్లయితే నేను వెంటనే చర్యలు తీసుకుంటానని చెబుతూనే ఎవరు కూడా కళాశాలకు వచ్చేటప్పుడు దారి మధ్యలో కానీ వెళ్ళేటప్పుడు మార్గంమద్యలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు భయపడకుండా వెంటనే నాకు తెలియజేసినట్లయితే నేను చర్యలు తీసుకుని అసభ్యకరమైనటువంటి పనులను చేసినటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటానని విద్యార్థులకు తన వంతు హామీ ఇస్తూ, సమాజంలో విద్యార్థుల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి విద్యను మధ్యలో ఆపివేయకుండా గొప్పగా చదువుకొని మీరు ఇలాంటి అన్యాయాలను అరికట్టేటటువంటి మంచి స్థాయిఉద్యోగాలను సంపాదించి మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని గౌరవనీయులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చెరుకుపల్లి జైపాల్ రెడ్డి గారు వివరించారు ఇట్టి కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు ఉరుమల్ల కృష్ణ దాస్ గారు మరియు అధ్యాపక బృందం , విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.