రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలకు 40 శాతం మిస్ చార్జీలను పెంచడం పై రెంజల్ మైనార్ట రెసిడెన్షియల్ పాఠశాల బాలికలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా అలాగే కొనసాగుతున్న మెస్ చార్జీలను ఏకంగా 40 శాతం పెంచడం హర్షనీయమని వారు పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్సియా నాజాం మాట్లాడుతూ బాలికలకు పౌష్టిక ఆహారాన్ని అందజేయాలన్న తలంపుతో ప్రభుత్వం ఏకంగా 40 శాతం పెంచడం బాలికలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ పాఠశాలలో నున్న బాలికలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తమ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆమె బాలికల తల్లిదండ్రులకు సూచించారు. తమ పాఠశాలలో సరిపడా సిబ్బంది ఉన్నారని బాలికలకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.