– సీఎం,మంత్రి,ఎమ్మెల్యే చిత్ర పటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ – బెజ్జంకి
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 21 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటనపై మండల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. అదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్ర పటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు, అయా గ్రామాల కార్యకర్తలు హజరయ్యారు.