నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తమ వాణి వినిపించి గత పాలకుల చేతిలో అన్యాయాన్నికి బలైన విఆర్ఓల సమస్యలపై ప్రస్తావించారని అందుకు మాజీ విఆర్ఓలు అందరు ఆయనకు రుణపడి ఉంటారని మాజీ విఆర్ఓల సంఘం నాయకులు మద్ది వెంకటనర్సిహ్మరెడ్డి, శ్రీరాం రమేష్, టి శ్రీశైలం, కుక్కల శ్రీనివాస్ లు హర్షం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో ఉన్న పాత విఆర్ఓలు అంతా కలిసి తమకు న్యాయం చేయాలని, గత పాలకులు చేసిన అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కలిసి తమ పరిస్థితులను వివరించారు. అందుకు ఆయన స్పందిస్తూ కచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్థాననీ హామీ ఇచ్చిన మాట ప్రకారం తమ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లినందుకు, జిల్లాలో ఉన్న పాత విఆర్ఓలు అందరు హర్షం వ్యక్తం చేస్తు ఆయనకు రుణపడి ఉంటామని తెలుపుతు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మళ్ళీ విఆర్ఓ వ్యవస్థలను పునరుద్ధరించి, మళ్లీ పాత స్థానం కల్పించేందుకు కృషి చేయాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.