ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పట్ల హార్షం

నవతెలంగాణ-ఖమ్మం
కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడంతో రైతులు, కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శనివారం రఘునాధపాలెం మండలం కోటపాడు రైతులు ఏర్పాటు చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్‌గౌడ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కొంటేముక్కల నాగేశ్వరరావు, కోటేరు నర్సిరెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చీమల గోపి, జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ కార్యదర్శిలు సన్నిళ్ల వెంకటేశ్‌, బోడా తావూరియా నాయక్‌, కోటపాడు గ్రామ సర్పంచ్‌ బాతుల రమణ, కాంగ్రెస్‌ నాయకులు బాతుల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు: పట్టణ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒకే దఫాలో రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రకటించన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శనివారం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కల్లూరు మండల కాంగ్రెస్‌ నాయకులు పసుమర్తి చందర్రావు, భాగం ప్రభాకర్‌ చౌదరి, బైర్ల కాంతారావు, లక్కినేని రమేష్‌, విజయరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు: ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ జీవో విడుదల చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి మండలంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, రైతులు శనివారం మర్లపాడు సెంటర్‌లో క్షీరాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు కసర చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల సోమిరెడ్డి, వెల్ది జగన్‌మోహన్‌రావు, సొసైటీ అధ్యక్షుడు తక్కెళ్ళపాటీ గోపాలకష్ణ, గన్నేని సురేష్‌, అట్లూరి సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.