
వీఆర్ఏల క్రమబద్దీకరణపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నిండుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని వీఆర్ఏల క్రమబద్ధీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. దివ్యాంగుల పెన్షన్ వేయి రూపాయలు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి వీఆర్ఏలు పనిచేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉందన్నారు. విఆర్ఏల క్రమబద్దీకరణ, దివ్యాంగుల పెన్షన్ పెంచడం, మైనార్టీల అభివృద్ధికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మైలారం సర్పంచ్ ఎల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు హనుమయ్య, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి రాజలింగం, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు ఆరుట్ల బాలయ్య, వీఆర్ఏలు శ్రీశైలం, జమున కడారి, కిషన్, కృష్ణ, నవీన్, శ్రీనివాస్, నారాయణ, చంద్రం, శ్రవణ్, కనకయ్య, స్వామి, శ్వేత, రజిత, ఎల్లవ్వ, శంకరయ్య, మల్లేశం, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.