మొదటి రోజే పుస్తకాలు,దుస్తులు అందించడం హర్షణీయం: ఎం.ఎన్.ఒ ప్రసాద్

నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్ధులకు పుస్తకాలు,ఏక రూపు దుస్తులు అందించడం ఆనందంగా ఉందని విద్యాశాఖ మండల నోడల్ అధికారి,మామిళ్ళ వారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట లో భాగంగా బుధవారం వారి పాఠశాలలో విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు,దుస్తులు అందించారు.పాఠశాలలో మొత్తం 151 మంది విద్యార్ధులు ఉన్నారని మొదటి రోజు 40 మంది హాజరు అయ్యారని తెలిపారు. సకాలంలో పుస్తకాలు,దుస్తులు పంపిణీ చేయడంతో మిగతా విద్యార్ధులు జాప్యం లేకుండా పాఠశాలకు హాజరు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభన్ బాబు,శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.