జాతీయ స్థాయిలో రజత పతకం సాధించిన హర్షప్రదకు ప్రశంసల జల్లు 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
జార్ఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో శుక్రవారం ముగిసిన జాతీయ స్థాయి తైక్వాండో 73 కేజీల కియోర్గి విభాగంలో గత శుక్రవారం ఫైనల్ కు చేరి, పోరాడి తెలంగాణ రాష్ట్రానికి రజత పతకం సాధించి పెట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన గిరిజన యువతి పాయం హర్షప్రద పై  ఆళ్ళపల్లి మండలంలోని పలువురు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖ వ్యాపారస్తులు, అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, యువత శనివారం ఓ ప్రకటనలో ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో ఫైనల్ కు చేరుకుని, చండీగఢ్ కు చెందిన తన ప్రత్యర్థి ఇతీషా దాస్ కి గట్టి పోటీ ఇవ్వడం గర్వకారణమన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్ళపల్లి మండలంలో యువతీయువకుల్లో దాగిన ప్రతిభను హర్షప్రద  దేశ నలుమూలల తెలిసేలా చేయడం హర్షణీయమన్నారు. అభినందనలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, మాజీ జడ్పీటీసీ కొమరం హనుమంతరావు, మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఎండీ.అతహార్, తులం ముత్తిలింగం, బుర్ర వెంకన్న, కరకపల్లి సుధాకర్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి కె.వి.సంఘమిత్ర, షేక్ మహమూద్ పాషా, ఏపీఓ రఘునాథ్, ప్రముఖ వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాసరావు, అబ్బు నాగేశ్వరరావు, బూరుగడ్డ రాములు, మొహమ్మద్ నయీమ్, కె.సునీత, షేక్ పర్వీన్, తదితరులు ఉన్నారు.