
పెద్దవూర మండలంలో ఏడు క్వింటాల్ల రేషన్ బియ్యం పట్టు బడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వీరబాబు తెలిపిన సమాచారం ప్రకారం తుంగతుర్తి గ్రామానికి చెందిన తెలకపల్లి సాంబశివ అను అతని ఇంటి యందు రేషన్ బియ్యం వున్నాయని తెలిసిన సమాచారం ప్రకారం అతని ఇంటికి వెల్లి తనిఖీ చేయగా సుమారు 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టు బడింది.ఇట్టి బియ్యంను అదే గ్రామానికి చెందిన ఈసరం ఏడుకొండలు, వంగూరి నరేందర్, ఈసరం ఈదయ్య ,దుగ్యాల సైదులు, వెంకటకృష్ణ ఇంకొంతమంది కలిసి అట్టి బియ్యంను అధిక ధరలకు అమ్ముటకు కాను సాంబశివ ఇంటిలో జమ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్న పిడిఎస్ బియ్యంను అమ్మటం కానీ కొనటం గాని చట్ట ప్రకారం నేరం. ఇట్టి వ్యక్తులు చట్టవిరుద్ధంగా పిడిఎస్ బియ్యంని అధిక ధరలకు అమ్ముతున్నారు, కావున వారిపై కేసు నమోదు చేసుకుని బియ్యం ను స్వాధీనం చేసుకొని గోదాoకు తరలించనైనదనీ ఎస్ వీరబాబు తెలిపారు.ఎవరైనా వ్యక్తులు పిడిఎస్ బియ్యంని అమ్మడం గాని కొనడం గాని చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ తెలిపినారు.