
– చంద్రం మృతి పట్ల
నవతెలంగాణ- దుబ్బాక రూరల్
దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంజ చంద్రం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకుని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం చంద్రం భౌతికయానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న చంద్రం మృతి అత్యంత బాధాకరం. పార్టీకి, ఆయన కుటుంబానికి చంద్రం లేనిలోటు తీరనిదని అన్నారు. అంతక ముందు మండల అధ్యక్షుడు కొంగరి రవితో కలిసి చెఱకు శ్రీనివాస్ రెడ్డి పంజ చంద్రం పాడే మోసి అంత్యక్రియలు ముగిసే సరికి అక్కడే ఉన్నారు. కార్యక్రమంలో దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంగర రవి ,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అనంతుల రాజుమహిపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీరాం నరేందర్, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.