– కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి
– ఆధ్వర్యంలో సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకుల చేరికలు.
నవతెలంగాణ -నెల్లికుదురు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం గ్రామంలో గత ఎన్నికల్లో మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ భారీగా మెజారిటీ ఇచ్చిన గ్రామం ఎర్రబెల్లి గూడెం గ్రామం ఆ గ్రామంలో దాదాపు 95 శాతం గ్రామ సర్పంచ్ బొమ్మెర అశోక్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పొనుగోటి రామారావు, గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు యూత్ నాయకులు ప్రజలు ఏకతాటిగా భరత్ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో ముకుమ్మడిగా చేరారు. జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భరత్ చందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానికేతరుడైన శంకర్ నాయక్ ను తరిమికొట్టి స్థానికుడైన డాక్టర్ మురళి నాయక్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీలో చేరిన ఎర్రబెల్లి గూడెం మాజీ పిఎసిఎస్ చైర్మన్ పొనుగోటి రామారావు గ్రామ సర్పంచ్ బొమ్మెర అశోక్ లు మాట్లాడుతూ గత ఎన్నికల్లో శంకర్ నాయకులు భారీ మెజారిటీగా గెలిపించిన గ్రామాలలో మా గ్రామం ముందు వరుసలో ఉంటుందని అలాంటి గ్రామాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని… శంకర్ నాయక్ గెలుపు కోసం కృషి చేసిన నాయకులను కూడా అహంకార పదజాలంతో కించపరుస్తూ హేళన చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నియంత పాలన కొనసాగించిన స్థానికేతరుడు శంకర్ నాయక్ పక్షాన మీరంటే మీకు కూడా బుద్ధి చెబుతామని మా గ్రామ ప్రజలు హెచ్చరించడంతో స్థానికుడైన మురళి నాయకులు గెలిపించాలని ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అంతేకాకుండా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరికి న్యాయం జరగలేదని ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీలో చేరామని వారు తెలిపారు. మా శక్తి వంచనకు మించి మానుకోట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారి మల్లయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొనుగోటి కిషన్ రావు, పల్లె యాకయ్య, శీలం మధు, మంద శ్రీనివాస్, జంపాల వెంకటేష్, బొమ్మగాని బిక్షపతి, బొమ్మగాని వెంకన్న, మర్ధ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.