తొందరపాటుతో పార్టీ మార్పు

– మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు తొందరపాటుతో బీఆర్‌ఎస్‌ ను వీడి వెళుతున్నారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అభిప్రాయపడ్డారు. అలాంటి వారు తల్లిలాంటి పార్టీని విమర్శించడం సరికాదని హితవు పలికారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.