‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ,’ఈ సినిమాకు కథ నేనే రాశాను. సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథ. గవర్నమెంట్ నుంచి ఉచితాలు తీసు కోవడం వల్ల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో తెలిపే సబ్జెక్టు ఇది. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సహజంగానే ఉంటాయి. 4 పాటలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ రాజేశ్ ఈ కథను చాలా బాగా తెరకెక్కించారు. మీరందరూ అదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాలో నేను జ్యోతి పాత్రలో నటించాను. యూత్‌కు బాగా నచ్చే సబ్జెక్ట్ ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కతజ్ఞతలు’ అని హీరోయిన్ నైనా చెప్పారు. ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ,’మా హీరో ఈశ్వర్ నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆయన కథకి పూర్తి న్యాయం చేశారు. కన్నడ, మలయాళం చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన నైనా సర్వర్‌కి ఇది తెలుగులో మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ పోషించిన విలన్ రోల్ ఈ సినిమాకు కీలకం. ఇంకా చమ్మక్ చంద్ర, భాషా, లక్ష్మణ్ సంజరు (బలగం ఫేమ్) హరీష్ చాలా మంది ఈ సినిమాలో నటించారు. రోషన్ సాలూరి, గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది’ అని చెప్పారు.