– కాంగ్రెస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పెద్దపులి కృష్ణ
నవతెలంగాణ-గండిపేట్
ఈ నెల 2వ తేదీ నుంచి నార్సింగి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ చేపట్టే హత్ సే హత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నార్సింగి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పెద్దపులి (కిషన్) కృష్ణ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ పార్టీ గండిపే ట మండ ల అధ్యక్షులు క్యాతం అశోక్‌యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా జ్ఞానేశ్వర్ పాల్గొంటారని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీ గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. అధికారంలోకి వస్తే పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు.