దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకి, బసవ తారకం కేన్సర్ హాస్పిటల్ అధ్యక్షులుగా సేవలందిస్తూ, హిందూపురం నుంచి మూడసారి ఎం.ఎల్.ఏగా విజయం సాధించిన నందమూరి బాలకష్ణని తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, ఈసీ మెంబర్ వి.వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు, కార్యదర్శి కోశాధికారితోపాటు తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి తదితరులు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం.. ఇదిలా ఉంటే, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశం ఈనెల 26వ తేదీన విజయవాడలో జరుగనుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివద్ధి చెందే దిశగా ఈ సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హెచ్‌ఆర్‌డి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతున్నట్టు వాణిజ్య మండలి కార్యవర్గం తెలిపింది.