సాధారణంగా ఎన్నికలనగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు పోటీ పడతారు. అనేక తాయిలాలు ప్రకటిస్తారు. హామీల వర్షం కురిపిస్తారు. ఏదో రకంగా ఓటర్లని ప్రభావితం చేసే పనిలో ఉంటారు. కానీ బీజేపీ నాయకులు దీనికి విరుద్ధం! అంటే వారు హామీలివ్వరని కాదు! వేదిక ఏదైనా వారు వల్లించే మంత్రం మాత్రం ప్రజల మధ్య చీలికలు పెట్టడం. దాంతో ఓట్లు పోలరైజేషన్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగి సింది. 3న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రాష్ట్రంలో తామే గెలవబోతున్నామని, ప్రగల్బాలు పలి కిన బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమిత మైంది. ఇటీవల జరిగిన ప్రచారం లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ఆ పార్టీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు, విద్వేషాలను పెంచేవిగా ఉండటం అభ్యంతరకరం. ప్రచారంలో భాగంగా అస్సాం ముఖ్య మంత్రి హిమంత బిశ్వశర్మ హైదరాబాద్‌లో ఓ సభలో ప్రసం గించారు. రాష్ట్రంలో బీజేపీని గెలి పిస్తే అధి కారంలోకి వచ్చిన అరగంటలో హైదరా బాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామ ని చెప్పారు. అంతకుముందు హైదరాబాద్ పేరు భాగ్యనగర్‌గానే ఉండేదని, 1590లో కులీ కుతుబ్‌షా పేరు మార్చారని ఆరోపించారు. హైదరా బాద్ సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన వారెవరూ ఇలా మాట్లాడరు. హైదరాబాద్ మత సామరస్యా నికి ఓ ప్రతీక. హిందూ, ముస్లింలు ఐక్యమత్యంతో ఉంటారు. ఇరువైపులా పండగలేవి జరిగినా శాంతి యుతంగా జరుపుకుంటారు. దానికి ఇటీవల జరిగిన ఓ ఉదాహరణ చూస్తే ఇక్కడి మతసామర స్యత ఏవిధంగా ఉంటుందో తెలుస్తుంది. సెప్టెం బర్‌లో వినాయకచవితి ఉత్సవాలను హిం దూ ప్రజలు ఘనంగా నిర్వహించారు. నెలాఖరు లో వినాయక నిమజ్జనం రోజే ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ మిలాన్‌నబీ వచ్చింది. వారు కూడా ప్రతియేటా ప్రద ర్శనలు తీస్తుంటారు. కానీ వినాయక నిమజ్జనానికి ఆటంకం కలగకుండా ముస్లిం మత పెద్దలు తమ పండగను ఒకరోజు అంటే అక్టోబర్ ఒకటికి వాయి దా వేసుకున్నారు. ఇది కదా అసలైన మతసామరస్యత అంటే… ఇది కదా అస లైన భారతీయ జీవన విధానం అంటే.. ఇదే కదా. అంతేకాదు నిమజ్జనం దారుల్లో హిందువులకు మంచినీళ్ల ప్యాకెట్లు, తినుబండా రాలు కూడా అందజేశారు. ఇవేమి తెలియని బీజేపీ నేతలు ఎక్క డినుంచో వచ్చి హైదరాబాద్ పేరును మారుస్తామంటున్నారు. ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారు. హిందూ, ముస్లింల మధ్య విధ్వంసక రచనకు పూనుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే విద్వేషంతో తాము అనుకునే అల్లర్లు, ఘర్షణల ద్వారా తమ హిందూత్వ ఆధిపత్యంతో ఓట్లు రాబట్టుకునేందుకు చేసే ప్రయత్నం!
అంతే కాదు, హిమంత సూర్యచంద్రులున్నంత వరకు సనాతన ధర్మం పరిఢవిల్లుతుందని చెప్పారు. ఏ ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరని కూడా అన్నారు. వారు చెప్పే సనాతన ధర్మం ఎలాం టిదో తమిళనాడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో ప్రపంచానికే అర్థమైంది. అణగారిన ప్రజల్ని మరింత అగాథంలో పడేసి, అగ్రవర్ణాలకు పెద్దపీట వేసి దళితుల్ని బానిసలుగా కొనసాగించేదే సనాతన. ఇంకా తాము తీసుకొస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్‌ను తెలంగాణలోనూ అమలు చేస్తామ న్నారు. ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేస్తా మని ప్రసంగించారు. హిందువుగా పుట్టినం దుకు గర్వపడేలా చేస్తానన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి? ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నాయి. ఆయన ప్రతి మాట వెనుక మతపరమైన ద్వే షం పెల్లుబుకుతున్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో లోపాలుంటే వాటిని సరిచేస్తామ నడం, లేదంటే అంతకన్నా మంచి ప్రతిపాదనలతో ముందుకు రావ డం చేయాలి. దీన్ని బట్టి చూస్తే వారికి కావాల్సింది ప్రజా సంక్షే మం కాదని అర్థమవుతోంది. హిం దూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం, ఆ పేరుతో రాజకీ యాలు చేయడమని స్పష్టమవుతోంది. ఇంకెంత కాలం ఈ ప్రవచనాలతో విద్వేషగీతం ఆలపిస్తారు? ఇంకెంతకాలం హిందూత్వ ప్రసంగాల్లో ప్రజల్ని ముం చుతారు? ఇంకెంతకాలం మతం ముసుగులో మారణహోమాల్ని సృష్టిస్తారు? ఇప్పటికే మణిపూర్ లో తెగల మధ్య పెట్టిన చిచ్చు ఇంకా ఆరనే లేదు. వంద లాది మంది చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమ య్యాయి. కుకీలను నడిరోడ్డుపై నగంగా పరిగె త్తించి మరీ చంపారు. చనిపోయిన వారి కుటుంబా లను పర మార్శకు కూడా ప్రధానికి తీరిక లేదు. కానీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఓపికగా చూసే సమయం ఉంది. దీన్ని బట్టి ఏమి అర్థం చేసుకో వాలి. దేశంలో ఏం జరుగుతోందో?విద్వేషపు రాజకీ యాలే నేడు ప్రజల్ని పరిపాలిస్తున్నాయి.
ఇది ఒక్క తెలంగాణలో కాదు హిమంత ఎక్కడి కెళ్లినా ఇదే విద్వేషం వెళ్లగక్కుతున్నారు? ఛత్తీస్‌గఢ్ ప్రచారంలోనూ ఇదే తంతు. కవార్ధాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి విజరుశర్మకు మద్దతుగా ప్రసంగించారు. అక్కడినుంచి ఎన్నికై అసెంబ్లీలో ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అక్బర్‌ను ఇష్టారీతిన తూల నాడుతు మాట్లాడారు. ‘ఒక అక్బర్ ఎక్కడికైనా వస్తే, అతను వంద మంది అక్బర్లను పిలుస్తాడు. కాబట్టి వీలైనంత త్వరగా అక్బర్‌ను ఇంటికి పంపకపోతే మాత (తల్లి) కౌశల్య భూమి అపవిత్రం’ అవుతుంది అన్నారు. అయోధ్య వివాదం నుంచి మొదలుకుని పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ వర కు, సొంత రాష్ట్రంలో వలసల వరకు అక్బర్ అనే పదాన్ని ముస్లింలకు ఒక రూపకం వలే ఉపయో గించాడు. దీనిపై ఈసీ ముఖ్యమంత్రికి షోకజ్ నోటీస్ జారిచేసింది. ఇదే ఏడాది జులైలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, మతాల మధ్య చిచ్చు, ఉద్దేశపూర్వక ప్రసంగాలపై నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్‌లో సీఎంపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. అక్కడి మియా వర్గానికి చెందిన ప్రజల్ని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని సీఎం చెప్పడమే ఇందుకు కారణం. మత సామరస్యాన్ని కాపాడాల్సిన ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య చీలికను పెంచుతున్నాయని పెద్ద దుమారమే రేగింది.
ఇదే కాదు అస్సాంలో బహుభార్యత్వ నిషేధం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెండ్లి చేసుకోవడానికి వారి మతాలు అను మతించినప్పటికీ ఇది అస్సాంలో వర్తించదట. ఒక వేళ రెండో పెండ్లి చేసుకోవాలనుకుంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలట. దాన్ని పరిశీలించిన మీదట అనుమతి ఇస్తే ఇస్తుం దట, లేదంటే ఇవ్వదంట. ఏదైనా ప్రభుత్వం ఆదేశం ప్రకారం నడుచుకోవాలట. దీనిపై అసెంబ్లీలో బహుభార్యత్వపు నిషేధం బిల్లు ను తీసుకొచ్చి సమగ్ర వివరాలు వెల్లడిస్తా మని చెప్పారు. ఈ అసంబద్ధ నిర్ణయంపై కూడా అక్కడ అసహనం పెల్లుబికింది. భార్య సంతాన యోగం లేకుంటే ఇరువురి అనుమతితో రెండో పెండ్లి చేసుకోవచ్చని హిందూ వివాహ చట్టం చెబుతోంది. కానీ ఆరెస్సెస్-బీజేపీ నేత లకు హిందూ వివాహం చట్టం పట్టదు. హిందూ త్వతో రాజకీయాలు చేయడంతో మాత్రం తెలుసు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమ స్వార్థ రాజకీయ ప్రయోజ నాల కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేందుకు ఇదో రుజువు. ఒక్క హిమంతే కాదు మోడీ నుంచి మొదలుకుని కేంద్రమంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎంపీలంతా మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగానే ఈ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానిం చారు. ప్రజల మధ్య చీలికను తెచ్చే ప్రయత్నం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. కానీ వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్స్. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.
సెల్ : 9490099140
నమిలికొండ అజయ్ కుమార్