– కాంగ్రెస్ స్క్వేర్ ఫీట్ కు 80 రూపాయల లంచం తీసుకుంటుంది భువనగిరికి ఉద్యోగాలు
– హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కులకు సమాన అవకాశాలు
– కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా తెలుసుకోండి
– రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..
నవ తెలంగాణ – భువనగిరి
భువనగిరి శాసనసభ్యులు మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టనున్నారని ఆరోగ్యశాఖ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు శనివారం రాత్రి 9 గంటలకు శాసనసభ్యులు బి ఆర్ ఎస్ అభ్యర్థి ఐల శేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ భువనగిరిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి చాలా మంచి వ్యక్తిని పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో వచ్చిన తర్వాత ఐదు గంటల కరెంటు మాత్రమే ఇస్తుందని మన దగ్గర 24 గంటల కరెంటు ఉందని తెలిపారు. శనివారం 6 బిఆర్ఎస్ సభలలో పాల్గొన్నానని ఎక్కడ చూసినా ప్రజల ప్రభంజన సునామి కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లకు మాత్రం ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయని వారు వాటికే మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్ చాలు అని అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ 5 గంటల కరెంటు ఇస్తామని కుండబద్దలు కొట్టిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. గతి లేని సంసారం చేయవచ్చుగాని శృతి లేని సంసారం చేయరాదని తెలంగాణలో సామెత ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య శృతి లేదన్నారు. ఈ జిల్లాలో కోమటిరెడ్డి కి జానారెడ్డికి ఉత్తంకుమార్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపారు. అన్నదాతల అంటే కెసిఆర్ కు ప్రాణం అని తెలిపారు. అందుకే వాళ్లకు రైతు బంధు, రైతు బీమా నిరంతర విద్యుత్తు పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం చెప్పులతో క్యూలైన్ కట్టేవారని ఎద్దేవా చేశారు. కరెంటు కోత దొంగ కరెంటు విషయాలు మీకు తెలుసునని తెలిపారు పాములు తేళ్లు, కరెంటు విద్యుత్ శాఖలతో రైతులు మృతి చెందిన సంఘటనలు మన కళ్లముతోనే ఉన్నాయన్నారు. మరోసారి కటిక చీకట్లోకి వెళ్లకుండా ప్రజలు బిఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుపడ్డదని వాళ్లకు చెప్పేపేట్టు లాగా హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. అన్నదాతల ఖాతాలో రైతుబంధు డబ్బులు ఈనెల 28న టింగ్ టింగ్ మని పడతాయని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లకు నకల్ చేయడం రాదన్నారు. కేసీఆర్ ఎకరానికి రూ. 16వేలు ఇస్తానంటుంటే కాంగ్రెస్ వాళ్ళు రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్న 15 వేలు మాత్రమే ఆర్థిక సాయం ఇస్తాం అంటున్నారు. ఈ కుట్రలను అన్నదాతలకు గమనించాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కసారి అంటూ అడుగుతున్నారని కానీ వారికి ప్రజలు 50 ఏళ్లు పరిపాలన ఇచ్చారని ఏమీ చేయలేకపోయారని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనా మసూరి సన్న బియ్యం ఇస్తామన్నారు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రూపాయలు 3000 నెలకు పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వస్తే ఆగమవుతామని ప్రజలు ఆలోచించి ఓట్లు చేయాలని కోరారు భువనగిరి ఎమ్మెల్యే టైర్ల శేఖర్ రెడ్డి చాలా మంచి మనిషిని అతనికి ఇంతకంటే పెద్ద పదవి రాయడం ఖాయమన్నారు పైల శేఖర్ రెడ్డి ముందు వరుసలో కూర్చుంటారన్నారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే లాస్ట్ కుర్చీలో కూర్చుంటారని పేర్కొన్నారు. ఇది భువనగిరి ప్రజలకు వచ్చే పదవిని పేర్కొన్నారు స్క్వేర్ ఫీట్ కు 80 రూపాయల లంచము కర్ణాటకలో కాంగ్రెస్ తీసుకుంటుందని వాటిని ఢిల్లీకి పంపిస్తామని చెప్తున్నారని తెలిపారు పిల్లల్లో దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అవినీతిలో ఆ పార్టీ కూర్కపోయిందన్నారు. సూర్యాపేట నల్గొండ బోనగిరి కి మెడికల్ కాలేజీలు అందించామన్నారు ఫ్లోరైడ్ రైత జిల్లా నల్గొండలో మార్చిన ఘనత టీఆర్ఎస్ దేని అన్నారు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఐటి టవర్ ద్వారా ఉద్యోగాలు అందజేస్తామన్నారు. ఢిల్లీకు గులాములైన కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలు అక్కడ మీటర్ నొక్కుతున్న ఇక్కడ ఆడుతారని తెలిపారు టిఆర్ఎస్కు మాత్రం తెలంగాణ ప్రజలే హై కమాండ్ అని తెలిపారు ఢిల్లీ గులాం కు ఓటు వేస్తారో ఇంటి పార్టీకి ఓటు వేస్తారో ఆలోచించాలని కోరారు. కొద్దిసేపు హిందీలో మాట్లాడి గంగా జమున లాగా కలిసి ఉండాలని కోరారు. బతుకమ్మ ఇతర పండుగలకు, క్రిస్టమస్కు, రంజాన్, కు బక్రీద్ ఒకేలా కెసిఆర్ చూస్తారని తెలిపారు. ముస్లింలు ఆటో లారీ డ్రైవర్లు క్లీనర్లుగా పంచర్ వెల్డింగ్ షాప్ లలో పని చేస్తూ పేదరికంలో ఉన్నారన్నారు వారు విద్యకు దూరమైనారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రెసిడెంట్లకు కూడా మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనలో నేటికీ ముస్లింలు వెనకబడి ఉన్నారని దాని కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. భువనగిరికి అత్యధిక చిన్న పిల్లల వైద్యశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పైల శేఖర్ రెడ్డి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి నాయకులు జడల అమరేందర్ గౌడ్ కొలుపుల అమరేందర్ లింగం యాదవ్ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు పాల్గొన్నారు.