హవల్దార్ ఆర్మోరర్ తాండ్ర రవికుమార్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ దేశ రక్షణలో భాగంగా 43 బెటాలియన్ హిమాచల్ ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నారు. రవికుమార్ ఈ సోమవారం 21 అక్టోబర్ అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. వారికి ఫోర్స్ తరఫున గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. 25 అక్టోబర్ శుక్రవారం రోజు పెద్దకర్మ లో భాగంగా పారా మిలటరీ ఐటిబిపి తెలుగు జవాన్స్ తరఫున రూ. 71 వేల , ఖమ్మం సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ పదివేల రూపాయలు,రిటైర్డ్ ఐటిబిపి బ్యాచ్ మేట్స్ తరఫున రూ. 31 వేల , భువనగిరి టౌన్ సిఐ రూ. 2000 , రవి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ భువనగిరి టౌన్ సిఐ , ఎక్స్ సి. ఏ. పీ.ఎఫ్ వారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు.