అధికారంలోకి ఉండి ఎప్పుడైనా ప్రజల్ని కలిశారా?

– మాజీ సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పదేండ్లు అధికారంలో ఉండి ఎప్పుడైనా ప్రజల్ని కలిశారా? అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. క్యాబినెట్‌ మంత్రులకే అపాయిట్‌మెంట్‌ ఇవ్వలేదని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తొమ్మిదేండ్ల కాలంలో కేసీఆర్‌ ఎన్ని రోజులు సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారో, సీఎం రేవంత్‌రెడ్డి తొమ్మిది నెలల కాలంలో ఎన్ని రోజులు అందుబాటులో ఉన్నారో లెక్క తేల్చుదామా? అని సవాల్‌ విసిరారు. రైతు రుణమాఫీలో పలు సమస్యలకు కేసీఆరే కారణమన్నారు. రైతులకు మేలు చేసేందుకే ఇంటింటి సర్వే చేస్తున్నదని చెప్పారు. దాన్ని కూడా బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.