మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్కసారైనా ప్రభుత్వ దవాఖాన సందర్శించావా

– మద్నూర్ మండలానికి ఇచ్చిన హామీలు అమలు చేసింది ఎక్కడ
– ప్రజలకు మభ్యపెట్టడానికే ఎమ్మెల్యే ప్రెస్ మీట్
– విలేకరుల సమావేశంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు బి హనుమాన్లు ఆరోపణ
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యేగా హనుమంత్ షిండే వరుసగా మూడుసార్లు గెలిచిన ఒక్కసారైనా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన దాఖలాలు లేవని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సర్కారు దావఖాన పట్ల పూర్తిగా మర్చిపోయాడని మద్నూర్ మండలానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని దశాబ్ది ఉత్సవాలు భాగంగా ఇటీవల మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మద్నూర్ మండల కేంద్రానికి సెంటర్ లైటింగ్ నిర్మాణం కోసం తొమ్మిది కోట్ల నిధులు మంజూరు. చేయించినట్లు ప్రకటించడం ఇది వచ్చే ఎన్నికల టంటుగా ప్రజలకు మభ్యపెట్టడానికె నాని ఆరు మాసాల క్రితం బిచ్కుంద మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ నిర్మాణం కోసం మంత్రుల చేత భూమి పూజ చేపట్టి ఇంతవరకు అక్కడ సెంటర్ లైటింగ్ పనులు ప్రారంభం కాలేదని ఇప్పుడు మద్నూర్ మండల కేంద్రానికి సెంటర్ లైటింగ్ నిర్మాణం కోసం తొమ్మిది కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు మండల ప్రజలకు మభ్యపెట్టడానికి ఎమ్మెల్యే ప్రగోల్ బాలు పలుకుతున్నారని ఈ మండలంలో అర్హులైన నిరుపేదలకు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మింప చేయలేదని ఊరికి ఐదు చొప్పున డబుల్ బెడ్ రూమ్ మంజూరైనట్లు చెప్పుకోవడమే కానీ వాటి నిర్మాణాలు ఎవరి పేరున చేపడుతున్నారని మద్నూర్ మండలానికి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు గాలికే వదిలేసారని కేంద్రీయ విద్యాలయం కచ్చితంగా మద్నూర్ మండలానికి మంజూరు అవుతుందని మూడు నాలుగు మాసాల క్రితం మండల ప్రజలకు ఎమ్మెల్యే అభయమిచ్చారని ఈ మండలానికి ఎలాంటి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే హనుమంతు షిండే ఏ ఒక్కటి నెరవేర్చడం లేదని చెప్పుకుంటూ పోతే ఇక్కడి ప్రజలకు ఏ ఒక్క సమస్య తీర్చలేదని శుక్రవారం నాడు బిజెపి మండల శాఖ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు బి హనుమానులు విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే మద్నూర్ మండల కేంద్రంలోని హాస్టల్లో ఉంటూ ఇక్కడే 10వ తరగతి వరకు చదువు నేర్చానని అప్పుడప్పుడు సభా సమావేశాల్లో ప్రజలకు గొప్పలు చెప్పుకుంటారు కానీ ఇక్కడే చదువు నేర్చు ఆఫీసర్ అయ్యావు ఆ తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చావు ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజా సమస్యలు గాలికే వదిలేసినట్లు అభివృద్ధి పనులు ఏ ఒక్కటి హామీలు నెరవేర్చడం లేదని ఆయన ఎమ్మెల్యే తీరుపై ఆరోపణలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు వెంకట్ కాలే కంచిన్ వార్ యాదవరావు పాల్గొన్నారు.