నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 12వ వార్డులో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ పార్మర్ ను తొలగించాలని బుధవారం స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు.ట్రాన్స్ పార్మర్ షాట్ సర్క్యూట్ ద్వారా షాక్ వస్తుందని,ట్రాన్స్ పార్మర్ ఇక్కడి నుంచి తొలగించి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని గతంలో పాలకులకు,అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రాణనష్టం జరిగితే కానీ పట్టించుకోరాని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ పార్మర్ షిప్ట్ చేయాలని కోరారు.లేదంటే సబ్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.