31 నుంచి హెచ్‌సీఏ శిక్షణా శిబిరాలు

31 నుంచి హెచ్‌సీఏ శిక్షణా శిబిరాలుహైదరాబాద్‌: క్యురేటర్స్‌, అంపైర్స్‌, స్కోరర్స్‌కు నిర్వహించనున్న శిక్షణ శిబిరాల తేదీలను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రధాన కార్యదర్శి దేవ్‌రాజ్‌ వెల్లడించారు. నిర్ణీత గడువు లోపు ధరఖాస్తులు పంపించిన అభ్యర్థులను మాత్రమే వర్క్‌షాప్స్‌లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఈనెల 31 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు వారం రోజుల పాటు క్యురేటర్స్‌ వర్క్‌షాప్‌, స్కోరర్లకు వచ్చే నెల 3 నుంచి 4వ తేదీ వరకు ఉదయం 8.15 గంటల నుంచి రెండ్రోజుల పాటు వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. అంపైర్లకు జూన్‌ 1వ తేదీన ఉదయం 8.15 గంటల నుంచి ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహించనుండగా, ఇందులో హెచ్‌సీఏ రిజిష్టర్‌ అంపైర్లు, స్కోరర్లు, వీడియో అనాలిసిస్టులు కూడా పాల్గొనవచ్చు. వర్క్‌షాప్స్‌లో పాల్గొనేవారికి ఉదయం అల్పాహారం, మధ్యహ్నాం భోజనం, సాయంత్రం హై-టీ అందించనున్నామని దేవ్‌రాజ్‌ తెలిపారు.