సిట్‌ కస్టడీకి హెచ్‌డి రేవణ్ణ

సిట్‌ కస్టడీకి హెచ్‌డి రేవణ్ణ– హసన్‌లో మహిళలపై అఘాయిత్యాల కేసులో అరెస్టు
బెంగళూరు : హసన్‌లో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన దర్యాప్తు కోసం జేడీ(ఎస్‌) నేత, మాజీమంత్రి హెచ్‌డీ రేవణ్ణను మూడు రోజుల పాటు సిట్‌ కస్టడీకి పంపారు. శనివారం సాయంత్రం ఆయనను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం కోరమంగళలోని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అంతకుముందు ఆయనకు బౌరింగ్‌ అండ్‌ లేడీ కర్జన్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈనెల 8 వరకు దర్యాప్తు బృందం కస్టడీలో వుంటారు. మైసూరులో పనిమనిషి కిడ్నాపింగ్‌ కేసులో ఆయనను అరెస్టుచేశారు.