హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ రుణాలు ప్రియం

– వడ్డీ రేట్ల పెంపు
న్యూఢిల్లీ : దిగ్గజ ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తమ రుణగ్రహీతలపై భారం మోపింది. రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (ఎంసిఎల్‌ఆర్‌) బెంచ్‌మార్క్‌ను 10 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఇది వరకు 9.05 శాతం నుంచి 9.40శాతం మధ్య ఉన్న వడ్డీ రేట్లు తాజాగా మరో 0.10 శాతం పెరగనున్నాయి. సవరించిన కొత్త వడ్డీ రేట్లు జులై 8 నుంచి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. దీంతో గృహ, వాహన, రిటైల్‌ రుణ వాయిదాల చెల్లింపులు భారం కానున్నాయి.