హైదరాబాద్‌లో ఆప్టిమా వెల్‌బీయింగ్ పేరిట ప్రత్యేకమైన ఓపీడీ (OPD) సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో

ఓపీడీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎండ్-టు-ఎండ్ నగదు రహిత ఔట్ పేషెంట్ వైద్య సేవలు, డయాగ్నోస్టిక్స్ మరియు మందులపై 50% వరకు తగ్గింపును అందిస్తుంది
నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హైదరాబాద్‌లో ఆప్టిమా వెల్‌బీయింగ్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ప్రారంభంలో ముంబయిలో ప్రారంభించగా, హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, బెంగళూరు, పుణె మరియు జైపూర్‌లకు విస్తరించారు. ఆప్టిమా వెల్‌బీయింగ్ అనేది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్ ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కి యాడ్-ఆన్ ఇన్సూరెన్స్ పరిష్కరణ కాగా, ఇది దేశంలోనే అత్యధిక రేటింగ్ పొందిన ఆరోగ్య నగదు పరిహారాన్ని అందించే బీమా ఉత్పత్తులలో ఒకటి.
భారతదేశంలో, out-of-pocket medical expenses మొత్తం ఆరోగ్య వ్యయంలో 45% కన్నా ఎక్కువగా ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఆప్టిమా వెల్‌బీయింగ్‌లో, వినియోగదారులు నగదు రహిత సదుపాయాన్ని, అపరిమిత టెలి, వ్యక్తిగత కన్సల్టేషన్లు, డయాగ్నోస్టిక్స్ మరియు మందులపై 50% వరకు తగ్గింపుతో పాటు ఇంటివద్ద స్యాంపిల్ కలెక్షన్ సేవలను ఉచితంగా పొందవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ మరియు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పార్థనిల్ ఘోష్ మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలో కీలక భాగస్వామిగా, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో మేము వినూత్నమైన ఆఫర్‌లతో, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని వినియోగదారుల శ్రేయస్సును మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నాము. ముంబయిలో 2023లో ప్రారంభించిన ఆప్టిమా వెల్‌బీయింగ్‌ను ఇప్పుడు మరో 7 నగరాలకు విస్తరిస్తున్నాము. ఎండ్-టు-ఎండ్ క్యాష్‌లెస్ మోడ్‌తో మా ఓపీడీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆరోగ్య బీమాను, అందుబాటు ధరలో, సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకువస్తుందని, ఆరోగ్య బీమాపై ప్రజల ‘నమ్మకాన్ని’ మరింతగా పెంచుతామన్న నమ్మకం తనకు ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోను 2002లో ప్రారంభించగా, తన వినియోగదారులకు సౌలభ్యం, సౌకర్యాన్ని అందించేందుకు వినూత్న సాంకేతిక-ఎనేబుల్డ్ ఆరోగ్య బీమా ఉత్పత్తులు, పరిష్కారాలను స్థిరంగా అందిస్తోంది. కంపెనీ 6 ఆరోగ్య బీమా ఉత్పత్తులు, 2 సర్వీస్ అప్‌గ్రేడ్‌ల పాత్-బ్రేకింగ్ సూట్‌ను ప్రారంభించగా, ఇది వినియోగదారులకు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మరియు అనిశ్చితులకు వ్యతిరేకంగా విస్తృత కవరేజీలను అందుకునేందుకు అనుమతిస్తుంది. అంతేకాకుండా, ఎన్ఆర్ఐ డిస్కౌంట్‌లు, ఉచిత నమూనా సేకరణతో అపరిమిత టెలి, ఫిజికల్ కన్సల్టేషన్‌లతో కూడిన ఓపీడీ ప్లాన్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులలో చేరేందుకు అనువైన గ్లోబల్ ట్రీట్‌మెంట్ వంటి ఫీచర్లతో భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన రిటైల్ ఆరోగ్య నష్టపరిహారం ఉత్పత్తులలో ఒకటైన ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది.
హెల్త్ కేర్ విధానంపై వినియోగదారుల ఆందోళనను పరిష్కరించేందుకు, వారికి విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు కంపెనీ బీమా-ఆధారిత పర్యావరణ వ్యవస్థ ‘హియర్’ పేరిట ఒక ప్రత్యేకమైన ఒన్-స్టాప్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించింది. హెల్త్ కార్నర్‌లో ఈ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన ఆరోగ్య, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలైన మధుమేహ నిర్వహణ పద్ధతులు, పేషెంట్-టు-పేషెంట్ కనెక్ట్ ఫీచర్ వంటి వాటితో సహాయం చేస్తుంది. ఇక్కడ వ్యక్తులు ఇలాంటి వైద్య విధానాలు చేయించుకున్న ఇతర వాలంటీర్‌లతో అనుసంధానం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తన ఆప్టిమా సెక్యూర్ ప్రొడక్ట్ ద్వారా వడ్డీ రహిత ఇన్‌స్టాల్‌మెంట్ ఆధారిత ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టి, భారతదేశంలో అగ్రగామిగా ఉంది. తద్వారా పాలసీదారులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఇది 12,000 మందికి పైగా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో నీ విస్తృత నెట్‌వర్క్ తన పాలసీదారులకు అడ్డంకులులేని-నగదు రహిత చికిత్సకు హామీ ఇస్తుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో (FY 23) యాక్సిడెంట్ మరియు హెల్త్ క్లెయిమ్‌ల కోసం చెప్పుకోదగిన క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 99%తో, బీమాను డెమోక్రటైజ్ చేసేందుకు, సమర్థవంతమైన మరియు హైపర్ పర్సనలైజ్డ్ కస్టమర్-సెంట్రిక్ సేవలను అందించేందుకు కంపెనీ తన నిబద్ధతను చాటి చెబుతోంది.