హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (HDFC ERGO) 6 కొత్త ఉత్పత్తులు,  2 సర్వీస్ అప్‌గ్రేడ్‌లను విడుదల

– నూతన స్వతంత్ర, యాడ్-ఆన్ ఉత్పత్తులు గ్లోబల్ హెల్త్‌కేర్ సౌకర్యాలకు మరియు అనిశ్చితులను అధిగమించేలా విస్తృత కవరేజీలను అందుకునేందుకు అనుమతిస్తాయి

– నగదు రహిత ఆసుపత్రిలో చేరిన వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించేందుకు సర్వీస్ అప్‌గ్రేడ్‌లు

నవతెలంగాణ : భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (HDFC ERGO) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆరోగ్య బీమాను సరసమైన ధరలో, మరింత సౌకర్యంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆరోగ్య బీమా ఉత్పత్తులు, సేవలలో సరికొత్త పరిష్కరణల శ్రేణిని అందుబాటులోకి  తీసుకువచ్చింది. భారత పౌరుల అభివృద్ధి చెందుతున్న అవసరాలు, ఆకాంక్షలను పరిష్కరించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఆరోగ్య పరిష్కారాలు మరియు సేవలు, భారతదేశ ఆరోగ్య బీమా రంగంలో సౌలభ్యం మరియు అందుబాటును మరింత మెరుగుపరచనున్నాయి. భారతదేశం వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయం, ఇటీవలి కొవిడ్ మహమ్మారితో నెలకొన్న ఆరోగ్య సంబంధిత అనిశ్చితితో, సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీలను కలిగి ఉండటం మరియు రక్షణ పొందడం ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (HDFC ERGO) కొత్త ఉత్పత్తులు, సేవల శ్రేణిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఆరోగ్య బీమా రంగంలో కొత్త కోణాన్ని ప్రారంభించి, వినియోగదారులకు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఎక్కువగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన ప్రస్తుత ఆప్టిమా సెక్యూర్ ఉత్పత్తికి కీలకమైన అప్‌గ్రేడ్‌లను ప్రారంభించగా, ఇది భారతదేశంలోని ఆరోగ్య బీమా సేవలు అందుకునే వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తులలో ఒకటిగా కూడా ఉంది. కంపెనీ కొత్త సర్వీస్ అప్‌గ్రేడ్‌లను కూడా ప్రవేశపెట్టగా, ఇది వినియోగదారులకు నగదు చెల్లించకుండానే ఆసుపత్రిలో చేరే సమయంలో ఎదుర్కొనే కీలక సమస్యలను పరిష్కరిస్తుంది. తద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

ఈ ఉత్పత్తుల శ్రేణిని ప్రారంభించడం గురించి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (HDFC ERGO) జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థనిల్ ఘోష్ మాట్లాడుతూ, “ఒక ‘కస్టమర్ ఫస్ట్’ ఆర్గనైజేషన్ మరియు భారతదేశంలో ప్రముఖ బీమా సంస్థగా, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో మా వినియోగదారులు సేవలు అందుకోవడాన్ని కొనసాగించేలా ప్రోత్సహించడం, ఆరోగ్య బీమా పరిష్కరణలతో రక్షణ అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము. ఈ ఆకాంక్షను నెరవేర్చేందుకు మా ప్రయత్నాలను కొనసాగిస్తూ, ఆరోగ్య బీమాను మరింత అందుబాటులోకి, సరసమైనదిగా మరియు సౌకర్యవంతంగా చేసేందుకు మా ప్రస్తుత ఆరోగ్య బీమా పథకాలు మరియు సేవలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని మేము గుర్తించాము. నేటి వినియోగదారులు ఒకే పరిమాణానికి సరిపోయే అన్ని విధానాలకు బదులుగా అనుకూలీకరించిన పరిష్కారాల కోసం చూస్తున్నారని, మేము కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆరోగ్య పరిష్కారాలు ఈ అవసరాన్ని పరిష్కరిస్తున్నాయని మేము అర్థం చేసుకున్నాము. మా ఉత్పత్తులు, సేవల ద్వారా మా వినూత్నమైన మరియు అనుకూలీకరించదగిన ఫీచర్లు ఆరోగ్య బీమా పట్ల భారతీయ పౌరులకు ‘విశ్వాసాన్ని’ మరింతగా పెంచుతాయని మరియు దేశంలో బీమాను చేర్చడంలో ప్రేరణగా పనిచేస్తాయని మేము విశ్వసిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.

కొత్త ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు:

1. ఆప్టిమా సెక్యూర్: మెరుగుదలలు

  • గ్లోబల్ ప్లాన్‌లు: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా చికిత్స పొందవచ్చు.

  • బీమా పరిశ్రమలో ఒక మొదటి ప్రయత్నంగా, అవసరమైన సమయంలో బీమా చేసిన వ్యక్తికి మద్దతు ఇచ్చే వ్యక్తి ప్రయాణ ఖర్చులను కవర్ చేసేలా ఒక ఎంపికను అందిస్తుంది

  • తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న కొత్త ఎంపికలు: బేస్ పాలసీలో భాగంగా ప్రీమియాన్ని మరింత తగ్గించేందుకు 5 లక్షల వరకు అధిక తగ్గింపులు. ఈ ఫీచర్ 5 ఏళ్ల పాలసీ వ్యవధి లేదా 50 సంవత్సరాల వయస్సు తర్వాత, ఏది తర్వాత తర్వాత అయితే దానికి అనుగుణంగా పూర్తి కవర్‌ను పునరుద్ధరించే ఎంపికతో కూడా లభిస్తుంది.

  • ఇండివిడ్యువల్ పర్సనల్ యాక్సిడెంట్ రైడర్: ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత అంగవైకల్యం మరియు శాశ్వత పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు మొత్తం చెల్లింపును అందించే యాడ్-ఆన్ కవర్

  • ఎన్ఆర్ఐలకు ప్రత్యేక తగ్గింపు: కంపెనీ దేశంలోనే మొదటిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రవాస భారతీయులకు (NRIలు) 40% వరకు ప్రత్యేక తగ్గింపులు; ఇది నవంబర్ 3వ వారం నుంచి ఎన్ఆర్ఐలకు అందుబాటులోకి వస్తుంది.

2. ఆప్టిమా వెల్‌బీయింగ్: ఎండ్-టు-ఎండ్ క్యాష్‌లెస్ మోడ్‌తో ఓపీడీ సబ్‌స్క్రిప్షన్

  • అపరిమిత టెలి, వ్యక్తిగత సంప్రదింపులు మరియు ఉచితంగా ఇంటి వద్దే నమూనా సేకరణలను పొందేందుకు బీమా పరిశ్రమలో మొదటి ప్రయత్నం

  • డయాగ్నోస్టిక్స్ మరియు ఔషధాలపై 40% వరకు తగ్గింపు

  • నగదు రహిత పర్యావరణ వ్యవస్థ

ఈ ఉత్పత్తి సేవలు మొదట ముంబయిలో ప్రారంభమై, త్వరలో ఇతర నగరాలకు విస్తరించబడుతుంది

3. మై: హెల్త్ కోటి సురక్ష

  • రూ.5 కోట్ల వరకు అధిక బీమా మొత్తంతో మెరుగైన వ్యక్తిగత ప్రమాద బీమా.

  • ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం మరియు శాశ్వత పాక్షిక వైకల్యంపై కవరేజ్

4. ఎక్స్‌ప్లోరర్: పునరుద్ధరించబడిన ప్రయాణ బీమా

  • కవరేజ్: హెల్త్ ఎమర్జెన్సీలు, విమాన ప్రమాదాలు మరియు వివిధ ఇన్-ట్రిప్ సంక్షోభాలను బీమా చేస్తుంది

  • అవసరాలకు అనుగుణమైన ప్లాన్‌లు: విలువ కోరుకునే వారి నుంచి ప్రీమియం కొనుగోలుదారుల వరకు విభిన్న లక్ష్య విభాగాలను కవర్ చేస్తుంది

  • ఆల్ ఇన్ వన్: ఒకే పాలసీలో కుటుంబ కవరేజీ

భారతదేశంలో నగదు రహిత క్లెయిమ్‌ల కోసం మొదటి-తరహా సేవలు

1. ఆసుపత్రుల నుంచి ముందస్తు డిశ్చార్జ్

  • నగదు రహిత సేవలను అందించే ఆసుపత్రి నుంచి వేగవంతమైన డిశ్చార్జ్ ప్రక్రియ-  వినియోగదారులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమయంలో ఎక్కువ సేపు ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. నగదు రహిత సేవలు అందించే ఆసుపత్రిలో చేరే రోగుల కోసం డిశ్చార్జ్ సమ్మరీపై ఆసుపత్రి ప్రతినిధి సంతకం చేసిన వెంటనే ఇంటికి తిరిగి వెళ్లవచ్చు.

ఈ సదుపాయం ప్రస్తుతం భారతదేశంలోని 14 రాష్ట్రాలలోని 16 నగరాల్లో ఉన్న 25 నెట్‌వర్క్ ఆసుపత్రులతో అందుబాటులో ఉండగా, త్వరలో ఇతర నగరాలకు కూడా విస్తరించేందుకు చర్యలు చేపట్టారు.

2. దీర్ఘకాలిక రోగులందరికీ  ముందస్తు-ఆమోదిత నగదు రహిత సౌకర్యాలు

  • దీర్ఘకాలిక రోగులకు ఒకేసారి ఆమోదం – కీమోథెరపీ, డయాలసిస్ మరియు రేడియోథెరపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల కోసం నగదు రహిత సేవలు అందించే ఆసుపత్రిలో చేరే రోగులు ఇప్పుడు ఒకే ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఒకే అనారోగ్యం కోసం అనేకసార్లు నగదు రహిత ఆసుపత్రిలో చేరేందుకు ఒకే ఆమోదాన్ని పొందితే సరిపోతుంది.

ఎగువ పేర్కొన్న రెండు సర్వీస్ ఫీచర్లు భారతదేశంలోని అన్ని బీమా సంస్థల కన్నా మొదటిసారిగా పరిచయం చేస్తుండగా, అటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స పొందుతున్న పాలసీదారుల కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని అందిస్తాయని భావిస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో (HDFC ERGO)ను 2002 ఏడాదిలో నెలకొల్పగా, తన వినియోగదారులకు సౌలభ్యం, సౌలభ్యాన్ని అందించుందకు వినూత్న టెక్-ఎనేబుల్డ్ ఆరోగ్య బీమా ఉత్పత్తులు మరియు పరిష్కారాలను స్థిరంగా తీసుకువస్తోంది. ఇటీవల కంపెనీ ఇన్సూరెన్స్ లీడ్ ఎకో-సిస్టమ్ ‘హియర్’ ఒక ప్రత్యేకమైన వన్-స్టాప్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించింది. ఆరోగ్య సంరక్షణపై వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడం, ఇక్కడ వారికి విశ్వసనీయ సమాచారాన్ని అందించడం ఇందులోని ప్రతిపాదనలలో ఒకటి.

అలాగే, పాలసీదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వడ్డీ రహిత వాయిదా ఆధారిత ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టిన భారతదేశంలో అగ్రగామిగా కంపెనీ ఉంది. అలాగే 12,000 మందికి పైగా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో కూడిన కంపెనీ తన విస్తృత నెట్‌వర్క్‌తో తన పాలసీదారులకు అడ్డంకులు-నగదు రహిత చికిత్సకు హామీ ఇస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY 23)లో యాక్సిడెంట్, హెల్త్ క్లెయిమ్‌ల కోసం 99% విశేషమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోతో, కంపెనీ బీమాను ప్రజాస్వామ్యీకరించేందుకు, సమర్థవంతమైన మరియు అధిక-పర్సనలైజ్ కస్టమర్-సెంట్రిక్ సేవలను అందించేందుకు తన నిబద్ధతను నొక్కి చెబుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఆరోగ్య బీమా ఉత్పత్తులపై మరిన్ని వివరాల కోసం, దయచేసి సందర్శించండి: https://www.hdfcergo.com/health-insurance.