హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ రిటైర్‌మెంట్ పోర్ట్ ఫోలియోని బలోపేతం చేస్తోంది

నవతెలంగాణ – ముంబయి: భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లస్. ఇది రిటైర్మెంట్ తర్వాత వినియోగదారులు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడానికి వీలుగా రూపొందించిన ప్లాన్. ఇది దాదాపుగా ‘జీతం’ లాగే సాధారణ మరియు గ్యారెంటీడ్1 స్ట్రీమ్ రూపంలో ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న రోజుల్లో ఎలాంటి జీవన శైలిని గడిపారో రిటైర్మెంట్ తరవాత అదే తరహా జీవన శైలిని కొనసాగించాలని ఎవరైతే కోరుకుంటారో.. సరిగ్గా అలాంటి వారికోసం రూపొందించబడినది హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లస్. ఇప్పుడు పొదుపు చేసి, రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రత కోసం పెద్ద మొత్తం దాచుకుని రిటైర్మెంట్ తర్వాత గడిపే సంవత్సరాలు బంగారంలా ఉండాలని ప్లాన్ చేసే వ్యక్తులకు ఇది అన్ని విధాలా అనువైనది. సరళంగా చెప్పాలంటే, ఈ యాన్యుటీ ప్రొడక్ట్ వినియోగదారులు వారి రిటైర్మెంట్ తర్వాతా వారు కోరుకున్న జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రొడక్ట్ ద్వారా ఒక వ్యక్తి తనతోపాటు తన జీవిత భాగస్వామికి సైతం ప్రయోజనం కల్పించే వెసులుబాటు ఉంది. ప్రీమియం చెల్లింపు వ్యవధితోపాటు, తిరిగి తీసుకునే మొత్తం కాల వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. పాలసీదారు ఆదాయాన్ని వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకునే సౌలభ్యం ఉంది. పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్‌ ప్లస్‌ ప్రస్తుతం విభిన్న రకాలుగా అందుబాటులో ఉంది. ఎంతో ప్రత్యేకంగా నిలిచే లిక్విడిటీ ఆప్షన్‌తో కూడిన యాన్యుటీతోపాటు ద్రవ్యోల్బణ ప్రభావం తట్టుకునే విధంగా మరియు ప్రీమియం ద్వారా ముందస్తు రాబడి (ఉదా: మనుగడ ప్రయోజనం) లభించే విధంగా సింపుల్ మరియు కాంపౌండ్ విధానంలో పెరుగుతూ ఉండే యాన్యుటీ ఆప్షన్ అందుబాటులో ఉంది. తద్వారా ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వ్యక్తులు వారి అవసరాలకు ఏది అత్యంత అనువుగా ఉంటుందని అనుకుంటారో ఆ ప్లాన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. పూర్తి ఆర్థిక స్వాతంత్ర్యంతో వారు కోరుకున్న విధంగా జీవించడానికి అనువుగా ఈ ఆలోచన చేయబడింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లస్ కీలక ప్రయోజనాలు కింద తెలిపిన విధంగా ఉంటాయి.
– వినియోగదారులు ఎలాంటి వైద్య పరీక్షలు మరియు అండర్‌రైటింగ్ అవసరాలు* లేకుండా 24 గంటల లోపే తమ పాలసీలను పొందవచ్చు.
– కేవలం ఒకసారి (సింగిల్ ప్రీమియం) లేదా పరిమిత చెల్లింపు కాలవ్యవధిలో ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితం మొత్తం గ్యారంటీడ్1 ఆదాయాన్ని పొందే అవకాశం ఈ ప్లాన్ కల్పిస్తుంది.
– యాన్యుటీ రేట్ అనేది ప్రారంభించినప్పుడు నిర్ణయించినదే ఉంటుంది. పాలసీ మొత్తం కాలవ్యవధిలో ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.
– హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ప్రస్తుత వినియోగదారులు మరియు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌కు చెందిన రిటైర్ అయిన ఉద్యోగులు/రిటైర్ అయిన ఉద్యోగుల జీవిత భాగస్వాములకు ప్రత్యేక రేట్ లభిస్తుంది.
– ఈ ప్లాన్‌లో వ్యక్తులు కొనుగోలు సమయంలో ఆకర్షణీయమైన యాన్యుటీ రేట్లను లాక్ చేస్తూనే, 15 సంవత్సరాల వరకు ఆదాయాన్ని వాయిదా వేసుకునే అవకాశాన్ని అందిస్తుంది.
– ఇందులో పాలసీ కాల వ్యవధిలో ఎప్పుడు అయినా ప్రస్తుత యాన్యుటీ చెల్లింపులను టాప్-అప్/సప్లిమెంట్‌గా మార్చుకునే ఆప్షన్ సైతం కల్పిస్తున్నారు. ఈ పాలసీ ప్రవేశపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ప్రొడక్ట్స్ & సెగ్మెంట్స్ హెడ్ అనీష్ ఖన్నా మాట్లాడుతూ, “భారతదేశంలో రిటైర్మెంట్ సేవింగ్స్ గ్యాప్ 2050# నాటికి 85 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు అధిక జీవన ప్రమాణాల కారణంగా వ్యక్తులు వారి వారికి సంపాదన ఉన్న సంవత్సరాల్లో ఉండే ఆదాయాన్నే వారికి సంపాదన లేని రోజుల్లోనూ ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవడం అత్యవసరం’’ అని చెప్పారు. ‘‘మేం తాజాగా అందిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లస్ రిటైర్‌మెంట్ తర్వాత జీవిత కాలంలో నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి అనువుగా రూపొందించిన ఒక ప్రత్యేకమైన యాన్యుటీ ప్లాన్. ఈ ప్లాన్ బహుళ ప్రయోజనకరమైన గ్యారంటీడ్ ఆదాయ ఎంపికలను అందిస్తుంది. వినియోగదారులు వారి రిటైర్డ్ జీవితానికి అవసరం అయినంత పొదుపు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. జాయింట్ లైఫ్ కవర్ తీసుకోవడం మరియు ప్రీమియం చెల్లింపులు సక్రమంగా చేయడం ద్వారా మన దేశ జనాభాలో ఎక్కువ మంది తమ రాబోయే సంవత్సరాలను బంగారుమయం చేసుకునేలా ముందుగానే ప్రణాళిక రూపొందించుకోగలరని మేము విశ్వసిస్తున్నాము. ఒక జీవిత బీమా సంస్థగా, మా వినూత్నమైన మరియు సౌకర్యవంతమైన ఉత్పత్తులతో వ్యాధులు, మరణం, వృద్ధాప్యంలో ఆధారపడటం వంటి ఇక్కట్ల నుంచి భారతదేశాన్ని రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము.’’ వరల్డ్ ఎకనామిక్ ఫోరం (https://www.weforum.org/whitepapers/investing-in-and-for-our-future) అన్ని అవసరమైన డాక్యుమెంట్లు పూర్తి చేయడం మరియు ఛాట్ ద్వారా ప్రీ కాన్వర్షన్ వెరిఫికేషన్ పూర్తిచేసే నిబంధనకు లోబడి ఉంటుంది. 1.గ్యారంటీడ్ ఆదాయం అనేది చెల్లించిన ప్రీమియం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. వర్తించే అన్ని నియమాలు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది.