హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ విన్నూత ప్రచారం

నవతెలంగాణ ముంబై: భారతదేశ ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ తన వినియోగ దారులతో వారికి సంబంధితంగా ఉండే, దృక్పథాలను తెలియజేసే విధంగా ఉండే కమ్యూనికేషన్ ద్వారా  తన సంబంధాన్ని బలోపేతం చేయడానికి స్థిరంగా కట్టుబడి ఉంది.  తన తాజా ప్రచార కార్యక్రమంతో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ తన బ్రాండ్ ఉనికిని విస్తరించడానికి మరియు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలకు మరింత ప్రగాఢంగా చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. వినియోగదారులు నిరంతరం మార్పు చెందుతూనే ఉన్నందున, బలమైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు, వారితో అనుబంధాన్ని పెంచడానికి స్థానికీకరించిన మార్కెటింగ్ వ్యూహాలు కీలకం. స్థానికంగా ప్రతిధ్వనించే సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలు, ప్రాంతీయత ఉట్టిపడేలా ఈ ప్రచారం రూపొందించబడింది. తన ఉనికిని విస్త రించడానికి సంస్థాగత వ్యూహంతో అనుగుణ్యం చేస్తూ, ఈ మార్కెట్లలో అనుబంధాన్ని పెంపొందించుకునేందు కు  ప్రాంతీయ భాషా కమ్యూనికేషన్ ద్వారా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి మార్కెట్లలో వినియోగదారులను ఆక ట్టుకోవడం ఈ ప్రచార కార్యక్రమ లక్ష్యం.
లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణ, సన్నద్ధత తప్పనిసరి అనే దృక్పథంపై ఈ క్యాంపెయిన్ రూపుదిద్దుకుంది. ప్రత్యేకించి టార్గెట్ మార్కెట్‌లలో జీవిత బీమా కొనుగోలుకు పిల్లల విద్య ఒక ముఖ్యమైన ప్రేరేపకం అని గుర్తించి ఈ కథనం అత్యంత సందర్భోచితంగా మారుతుంది. విజయాన్ని సాధించడంలో తండ్రి తన కూతురికి క్రమ శిక్షణ విలువను నేర్పించే జీవిత పాఠాన్ని ఈ చిత్రం చెబుతుంది.
ఈ ప్రచార కార్యక్రమం గురించి హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు స్ట్రాటజీ గ్రూప్ హెడ్ విశాల్ సుబర్వాల్ మాట్లాడుతూ, ‘‘”మేం ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్‌లలో వృద్ధిని కొనసాగిస్తూ, బలమైన పంపిణీ, కొత్త శాఖలతో ప్రాంతాలకు లోతుగా విస్తరిస్తున్నాం. మా లక్ష్యం అనుకూలమైన ప్రాంతీయ కమ్యూనికేషన్ ద్వా రా ప్రేక్షకులతో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి, ఈ ప్రచారం దక్షిణాది మార్కెట్‌లపై దృష్టి సారించ డం మా మొదటి అడుగు. ఈ చిత్రంతో, తమ పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటు అందించేలా వారిని ఆర్థికంగా స న్నద్ధం చేయడాన్ని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని అన్నారు. ‘‘ ఈ సందర్భంగా లియో బర్నెట్ సౌత్ ఏషియా చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ విక్రమ్ పాండే  మాట్లాడుతూ, ‘‘ “జీవితం లో, మనం సహజంగానే గెలుపొందడాన్ని ఎక్కువగా అంచనా వేస్తాం – ప్రతి ఒక్కరూ ఒక పని తుది ఫలితంపై దృష్టి పెడతారు. ఈ పదునైన కొత్త తండ్రీకూతుళ్ల కథనంతో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఏ పనికైనా మనం 100% కృషిని అందించడంపై దృష్టి పెట్టడం ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. మిగితాది దాన్ని అనుసరిస్తుంది” అని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమం టెలివిజన్, డిజిటల్, ఇతర మాస్ మీడియాతో సహా బహుళ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది.